స్కూల్ వాట్సాప్ గ్రూప్లో పోర్న్ వీడియోలు.. షేర్ చేస్తున్న తల్లిదండ్రులు
దిశ,వెబ్డెస్క్: కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఈ ఆన్ లైన్ క్లాసుల్లో డౌట్స్ క్లియర్ చేసుకోవాలన్నా, హోం వర్క్ కంప్లీట్ చేయాలన్నా అంతా వాట్సాప్ నుంచే జరుగుతుంది. అయితే రోజురోజుకు విద్యార్థుల స్కూల్ వాట్సాప్ గ్రూపుల్లో పోర్న్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. టీచర్లపై కోపంతోనే లేదంటే, ఆటపట్టించేందుకు కొంతమంది ఆకతాయి విద్యార్థులు పోర్న్ వీడియోల్ని వాట్స్ గ్రూపుల్లో షేర్ చేసిన కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విద్యార్థుల […]
దిశ,వెబ్డెస్క్: కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఈ ఆన్ లైన్ క్లాసుల్లో డౌట్స్ క్లియర్ చేసుకోవాలన్నా, హోం వర్క్ కంప్లీట్ చేయాలన్నా అంతా వాట్సాప్ నుంచే జరుగుతుంది. అయితే రోజురోజుకు విద్యార్థుల స్కూల్ వాట్సాప్ గ్రూపుల్లో పోర్న్ వీడియోలు కలకలం రేపుతున్నాయి.
టీచర్లపై కోపంతోనే లేదంటే, ఆటపట్టించేందుకు కొంతమంది ఆకతాయి విద్యార్థులు పోర్న్ వీడియోల్ని వాట్స్ గ్రూపుల్లో షేర్ చేసిన కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విద్యార్థుల తల్లిదండ్రులే వాట్సాప్ గ్రూప్లో పోర్న్ వీడియోల్ని షేర్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తల్లిదండ్రులపై విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదవతున్నాయి.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పలు స్కూళ్లకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో పోర్న్ వీడియోలు దర్శనమివ్వడంతో విద్యాశాఖ అధికారులు ఆయా స్కూళ్ల యాజమాన్యాలతో పాటు విద్యార్థుల, వారి తల్లిదండ్రులు, అన్నీ డిపార్ట్ మెంట్ల సిబ్బందికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జహంగీర్ పూరికి చెందిన సివిక్ బాడీ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ అసభ్యకర ఫోటోలు, వీడియోల్ని షేర్ చేయోద్దని విద్యార్థులకు, వారి తల్లిదండ్రుల్ని కోరుతున్నాం. గత డిసెంబర్ నెలలో 5వ తరగతికి చెందిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ వీడియోల్ని షేర్ చేశారు. సదరు కాంటాక్ట్ నెంబర్ కు ఇలాంటి వీడియోల్ని షేర్ చేయోద్దని మెసేజ్ చేసినా తల్లిదండ్రులు పట్టించుకోలేదన్నారు. అందుకు వారిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారులు సంబంధిత వాట్సాప్చాట్ ను షేర్ చేశామన్నారు.
మా స్కూల్ కు చెందిన ఓ మహిళా టీచర్ కు విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ నుంచి అసభ్యకరమైన వీడియోలో షేర్ అయ్యాయి. ఈ అంశంపై తాము తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశామని, అయితే ఆ వీడియోల్ని తమ బంధువు ఒకరు షేర్ చేశారని సివికి బాడీ టీచర్స్ జనరల్ సెక్రటరీ రామ్ నివాస్ సోలంకి వాపోయారు. అందుకే ఇకపై పోర్న్ వీడియోలు విద్యార్థుల స్కూల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కనిపిస్తే వెంటనే ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో పోర్న్ వీడియోలు, అసభ్యకరమైన ఫోటోల్ని షేర్ చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నార్త్ ఢిల్లీ మేయర్ జై ప్రకాష్ వార్నింగ్ ఇచ్చారు.