పిల్లలు లోపల.. తల్లిదండ్రులు బయట ధర్నా
దిశ, మునుగోడు: తమ పిల్లలను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. నల్లగొండ జిల్లా చండూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. వేముల పవన్ కల్యాణ్, భూతరాజు వేణు, గండూరి మల్లేష్‌లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. చామలపల్లిలో భూ తగాదా విషయంలో తమ పిల్లలను పోలీసు స్టేషన్‌లో గత ఐదు రోజుల నుంచి నిర్భందించారన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే తమ పిల్లలను […]
దిశ, మునుగోడు: తమ పిల్లలను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. నల్లగొండ జిల్లా చండూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. వేముల పవన్ కల్యాణ్, భూతరాజు వేణు, గండూరి మల్లేష్‌లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. చామలపల్లిలో భూ తగాదా విషయంలో తమ పిల్లలను పోలీసు స్టేషన్‌లో గత ఐదు రోజుల నుంచి నిర్భందించారన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే తమ పిల్లలను వేధింపులకు గురిచేస్తున్నారని, కేసు నమోదు చేస్తే కోర్టులో హాజరుపర్చాలి, కానీ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి ఇబ్బందులకు గురి చేయటం ఏంటని వారు ప్రశ్నించారు.