కలిసి బతుకుదామని నమ్మించి.. పిల్లాడితో సహా వివాహితను..!

దిశ, కామారెడ్డి : ఆమెకు భర్త, మూడేళ్ళ కుమారుడు ఉన్నారు. భర్త విదేశాలకు వెళ్ళాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కలిసి బతుకుదామని చెప్పిన అతన్ని నమ్మి కుమారునితో పాటు వచ్చేసింది. తనవద్ద ఉన్న చెవి కమ్మలు అమ్మగా వచ్చిన డబ్బులు, మొబైల్ ఫొన్ తీసుకుని బస్టాండులో తల్లి కుమారుని వదిలి వెళ్ళిపోయాడు ఆ దుర్మార్గుడు.ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసర మండలం […]

Update: 2021-08-19 10:56 GMT

దిశ, కామారెడ్డి : ఆమెకు భర్త, మూడేళ్ళ కుమారుడు ఉన్నారు. భర్త విదేశాలకు వెళ్ళాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కలిసి బతుకుదామని చెప్పిన అతన్ని నమ్మి కుమారునితో పాటు వచ్చేసింది. తనవద్ద ఉన్న చెవి కమ్మలు అమ్మగా వచ్చిన డబ్బులు, మొబైల్ ఫొన్ తీసుకుని బస్టాండులో తల్లి కుమారుని వదిలి వెళ్ళిపోయాడు ఆ దుర్మార్గుడు.ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసర మండలం యంచ గ్రామానికి చెందిన సాయిలు, లక్ష్మిలు దంపతులు.

వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. సాయిలు బతుకుదెరువు కోసం గత రెండేళ్ల కిందట దుబాయ్‌కు వెళ్ళాడు. ఈ క్రమంలోనే గత ఏడాది కిందట లింబ గ్రామానికి చెందిన పాపన్నతో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. లక్ష్మిని తీసుకొని గత మూడు రోజుల క్రితం పాపన్న సదాశివనగర్ మండల కేంద్రానికి వచ్చాడు. స్నేహితుని ఇంట్లో రెండు రోజులు ఉన్నారు. గురువారం ఉదయం పాపన్న లక్ష్మిని ఆమె కుమారుని కామారెడ్డికి తీసుకువచ్చి ఆమె చెవి కమ్మలు తాకట్టు పెట్టించాడు.

వాటికి 9000 రూపాయలు వచ్చాయి. అనంతరం కామారెడ్డి బస్టాండుకు లక్ష్మి, పాపన్నలు వచ్చారు. లక్ష్మి వద్ద 8 వేల రూపాయలు, సెల్‌ఫొన్ తీసుకుని బయటకు బాత్ రూమ్ వెళ్లి వస్తానని చెప్పి పాపన్న వెళ్లిపోయాడు. సుమారు గంట పాటు పాపన్న కోసం లక్ష్మీ ఎదురు చూసినా ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన లక్ష్మీ కామారెడ్డి పట్టణ పోలీసులను ఆశ్రయించింది.

Tags:    

Similar News