కరోనాతో మూడొంతుల చిన్న వ్యాపారాలు కుదేలు!
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ మహమ్మారి కారణంగా దేశంలో మూడొంతుల చిన్న వ్యాపారాలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. తయారీ రంగంలో ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు ప్రముఖ డాటా సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని 82 శాతం చిన్న వ్యాపారాలు మహమ్మారి సమయంలో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. ఉత్పత్తి, సేవల రంగాల నుంచి మొత్తం 250కి పైగా కంపెనీల నుంచి వివరాలను సేకరించారు. ఈ కంపెనీలు ఏడాదికి రూ. […]
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ మహమ్మారి కారణంగా దేశంలో మూడొంతుల చిన్న వ్యాపారాలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. తయారీ రంగంలో ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు ప్రముఖ డాటా సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని 82 శాతం చిన్న వ్యాపారాలు మహమ్మారి సమయంలో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. ఉత్పత్తి, సేవల రంగాల నుంచి మొత్తం 250కి పైగా కంపెనీల నుంచి వివరాలను సేకరించారు. ఈ కంపెనీలు ఏడాదికి రూ. 100 కోట్ల నుంచి రూ. 250 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తున్నాయి. సుమారు 70 శాతం కంపెనీలు కరోనాకు ముందు ఉన్న డిమాండ్‌ను తిరిగి పొందడానికి దాదాపు ఏడాది సమయం పడుతుందని అభిప్రాయపడ్డాయి.
గతేడాది కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. కేసులు మళ్లీ పెరగడం, కీలక ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ వల్ల ఆదాయ వృద్ధి మందగించడంతో పాటు గిరాకీ క్షీణించడం వల్ల ఆర్థికరంగంపై తీవ్ర ప్రభావం ఉండనుంది. 60 శాతం కంపెనీలు ప్రభుత్వం నుంచి పథకాలతో పాటు మరిన్ని చర్యలు, మద్దతును ఆశిస్తున్నట్టు స్పష్టం చేశాయి. చిన్న వ్యాపారాల వృద్ధికి ఆటంకం కలిగించే అంశాల గురించి.. 42 శాతం కంపెనీలు మార్కెట్ యాక్సెస్, 37 శాతం ఉత్పాదకతను మెరుగుపరచడం, 34 శాతం ఎక్కువ ఫైనాన్స్‌ను సాధించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పాయి. ‘భారత్‌లో చిన్న వ్యాపారాల రికవరీపై ఆధారపడే ఆర్థికవ్యవస్థ రికవరీ ఉంటుందని’ గ్లోబల్ చీఫ్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ అన్నారు.