అవినీతి వల్లే కట్ట తెగింది- జడ్పీటీసీ ఆరోపణ

దిశ,ఆమనగల్లు: కాంట్రాక్టర్ అవినీతితో, అధికారుల నిర్లక్ష్యం వల్ల తలకొండపల్లి మండలం దేవునిపడకల్ గ్రామ సమీపంలోని మహ్మద్‌ఖాన్ చెరువుకు గండి పడిందని జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఆరోపించారు. బుధవారం ఆయన గండి పడిన చెరువు కట్టపై స్థానిక రైతులు, మత్స్య కారులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాల క్రితం మిషన్ కాకతీయ పథకంలో కట్ట మరమత్తులు చేపట్టారని అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం వలనే కట్టకు గండి పడిందని […]

Update: 2021-09-01 08:58 GMT
katta
  • whatsapp icon

దిశ,ఆమనగల్లు: కాంట్రాక్టర్ అవినీతితో, అధికారుల నిర్లక్ష్యం వల్ల తలకొండపల్లి మండలం దేవునిపడకల్ గ్రామ సమీపంలోని మహ్మద్‌ఖాన్ చెరువుకు గండి పడిందని జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఆరోపించారు. బుధవారం ఆయన గండి పడిన చెరువు కట్టపై స్థానిక రైతులు, మత్స్య కారులతో కలిసి ధర్నా నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాల క్రితం మిషన్ కాకతీయ పథకంలో కట్ట మరమత్తులు చేపట్టారని అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం వలనే కట్టకు గండి పడిందని ఆయన ఆరోపించారు. గతంలో చెరవులకు గండ్లు పడితే 24 గంటల్లో మరమత్తులు చేశారని, ఈ చెరువుకు గండిపడి మూడు రోజులు కావస్తున్న అధికారులు, ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచారకరమన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చెరువు కట్ట మరమత్తులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నాలో ఎంపీటీసీలు రఘు, రమేష్, సర్పంచ్ శ్రీశైలం, రైతులు , మత్స్యకారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News