ఏసీబీ వలలో అవినీతి తిమింగలం..

దిశ, ఆదిలాబాద్ : అవినీతి నిరోధక శాఖ వలలో మరో తిమింగలం చిక్కింది. ఆదిలాబాద్ జిల్లాలో నడిరోడ్డు మీద లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఏఈ చంద్రశేఖర్‌ను ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతకుముందు సీసీ రోడ్డు పనుల నిర్మాణం అనంతరం గుత్తేదారుకు చెల్లించాల్సిన బిల్లు కోసం ఏఈ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అనంతరం ACB ప్లాన్ మేరకు పట్టణ సమీపంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్ వద్ద […]

Update: 2021-01-28 05:34 GMT
ఏసీబీ వలలో అవినీతి తిమింగలం..
  • whatsapp icon

దిశ, ఆదిలాబాద్ : అవినీతి నిరోధక శాఖ వలలో మరో తిమింగలం చిక్కింది. ఆదిలాబాద్ జిల్లాలో నడిరోడ్డు మీద లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఏఈ చంద్రశేఖర్‌ను ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతకుముందు సీసీ రోడ్డు పనుల నిర్మాణం అనంతరం గుత్తేదారుకు చెల్లించాల్సిన బిల్లు కోసం ఏఈ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అనంతరం ACB ప్లాన్ మేరకు పట్టణ సమీపంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్ వద్ద AEకు రూ.2లక్షలు అందజేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా దాడులు జరిపి చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ నిమిత్తం ఏఈని MPDO కార్యాలయానికి తరలించి విచారించారు.

Tags:    

Similar News