ఎంజేపీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
మంచిర్యాల జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 6,7,8,9 తరగతుల్లో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ఎంజేపీ బ్యాక్ లాగ్ సెట్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ సేరు శ్రీధర్ శుక్రవారం తెలిపారు.

దిశ, లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 6,7,8,9 తరగతుల్లో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ఎంజేపీ బ్యాక్ లాగ్ సెట్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ సేరు శ్రీధర్ శుక్రవారం తెలిపారు. అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా కానీ లేదా సమీప మీ సేవ కేంద్రాల ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేదీ కాగా ఏప్రిల్ 20వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు బోనఫైడ్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫొటో, సంతకం, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నారు. చివరి రోజు వరకు నిరీక్షించకుండా తల్లిదండ్రులు తక్షణమే స్పందించి సకాలంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. ప్రవేశ పరీక్షకి సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 15వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని, మరింత సమాచారం కోసం వెబ్సైట్ https://mjptbcwreis.telangana.gov.in లో కానీ లేదా 040-23328266 ని సంప్రదించాలన్నారు.