పంచాయతీ భవనమే.. వినాయక మంటపం

దిశ, మునుగోడు: కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ.. గ్రామానికి ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆ గ్రామ ప్రజలు తూచాతప్పకుండా పాటించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని జైకేసారం గ్రామ ప్రజలు ఐక్యతను ప్రదర్శించారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్నందునా ఎవరి ఇండ్లలో వారే వినాయడిని ప్రతిష్టించారు. గ్రామంలో ఏ ఒక్క వీధిలో కూడా మంటపాలను ఏర్పాటు చేయకుండా, గ్రామ పంచాయతీ భవనంలో మాత్రమే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని పాలకమండలి తీర్మానం చేయడంతో ప్రజలందరూ […]

Update: 2020-08-23 02:47 GMT

దిశ, మునుగోడు: కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ.. గ్రామానికి ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆ గ్రామ ప్రజలు తూచాతప్పకుండా పాటించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని జైకేసారం గ్రామ ప్రజలు ఐక్యతను ప్రదర్శించారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్నందునా ఎవరి ఇండ్లలో వారే వినాయడిని ప్రతిష్టించారు. గ్రామంలో ఏ ఒక్క వీధిలో కూడా మంటపాలను ఏర్పాటు చేయకుండా, గ్రామ పంచాయతీ భవనంలో మాత్రమే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని పాలకమండలి తీర్మానం చేయడంతో ప్రజలందరూ సహకరించి అక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News