మానవత్వం చాటిన పంచాయతీ సిబ్బంది

దిశ, పాలేరు: శనివారం కరోనా అనుమానితుడిగా మృతి చెందిన ఓ వ్యక్తికి పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు చేసి మానవత్వం చాటారు. వివరాల్లోకి వెళితే.. కూసుమంచి మండలం గైగోళ్లపల్లి గ్రామ పంచాయతీలో అల్లి వెంకటి(46) అనే వ్యక్తి మృతి చెందారు. దీనితో కుటుంబ సభ్యులు, బంధువులెవరూ అంత్యక్రియలు చేసేందుకు సాహసించలేదు. దీనితో విషయం తెలుసుకున్న పంచాయతీ సిబ్బందే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటి వద్ద బ్లీచింగ్, హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారి చేశారు. […]

Update: 2021-05-15 11:56 GMT

దిశ, పాలేరు: శనివారం కరోనా అనుమానితుడిగా మృతి చెందిన ఓ వ్యక్తికి పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు చేసి మానవత్వం చాటారు. వివరాల్లోకి వెళితే.. కూసుమంచి మండలం గైగోళ్లపల్లి గ్రామ పంచాయతీలో అల్లి వెంకటి(46) అనే వ్యక్తి మృతి చెందారు. దీనితో కుటుంబ సభ్యులు, బంధువులెవరూ అంత్యక్రియలు చేసేందుకు సాహసించలేదు. దీనితో విషయం తెలుసుకున్న పంచాయతీ సిబ్బందే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటి వద్ద బ్లీచింగ్, హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారి చేశారు. దీనితో గ్రామపంచాయతీ సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి, వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి మహిముదా, గ్రామ పంచాయతీ సిబ్బంది మల్లయ్య, గణేష్, నాగయ్య పుల్లయ్య, ఆశా వర్కర్లు భాగ్యమ్మ రాములమ్మ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags:    

Similar News