కేంద్రంపై పోరాటం కొనసాగుతుంది : పల్లా రాజేశ్వర్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతు శ్రేయస్సు కోసం కృషి చేసే ప్రభుత్వం వచ్చే వరకు పోరాడుతూనే ఉంటానని వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే అవకాశమే […]

Update: 2021-12-13 02:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతు శ్రేయస్సు కోసం కృషి చేసే ప్రభుత్వం వచ్చే వరకు పోరాడుతూనే ఉంటానని వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే అవకాశమే లేదని, అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోందని ఎద్దేవ చేశారు.

సమయానుకూలంగా ఏకీకృత శక్తులతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. నీతి అయోగ్ ప్రకటించిన ప్రకారం దేశంలో తెలంగాణ రెండో స్థానంలో వృద్ధిలో ఉందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆనంద్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News