14 రోజుల క్వారంటైన్‌కు పాకిస్తాన్ టీం
దిశ, స్పోర్ట్స్: లాక్‌డౌన్ అనంతరం జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ కోసం ఈనెల 28న పాకిస్తాన్ క్రికెట్ టీం ఇంగ్లాండ్‌కు బయలుదేరుతున్నది. అక్కడకు వెళ్లే ముందే రెండు సార్లు జట్టు సభ్యులకు, ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. లాహోర్ నుంచి ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీం డర్బిషైర్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటుందని పీసీబీ అధికారి స్పష్టం చేశారు. క్వారంటైన్ సమయంలో అక్కడే క్రికెట్ సాధనకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు […]
దిశ, స్పోర్ట్స్: లాక్‌డౌన్ అనంతరం జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ కోసం ఈనెల 28న పాకిస్తాన్ క్రికెట్ టీం ఇంగ్లాండ్‌కు బయలుదేరుతున్నది. అక్కడకు వెళ్లే ముందే రెండు సార్లు జట్టు సభ్యులకు, ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. లాహోర్ నుంచి ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీం డర్బిషైర్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటుందని పీసీబీ అధికారి స్పష్టం చేశారు. క్వారంటైన్ సమయంలో అక్కడే క్రికెట్ సాధనకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. 29 మంది సభ్యులు కలిగిన క్రికెట్ టీంను ఇంగ్లాండ్ పంపిస్తున్నారు. సిరీస్ మధ్యలో ఎవరైన ఆటగాడు కరోనా బారిన పడితే అతని స్థానంలో ఆడించడానికి అందుబాటులో ఉండటానికే అదనపు ఆటగాళ్లను పంపిస్తున్నట్లు పీసీబీ తెలిపింది. సిరీస్ జరుగుతున్నన్ని రోజులూ ఆటగాళ్లు ఇతరులను ఎవరినీ కలవరని బోర్డ్ స్పష్టం చేసింది.