కర్తార్‌పూర్ కారిడార్ తెరుస్తామన్న పాక్
న్యూఢిల్లీ: సోమవారం(జూన్ 29) నుంచి కర్తార్‌పూర్ కారిడార్ తెరుస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. అకాస్మత్తుగా చేసిన ఈ ప్రకటనపై భారత్ కూడా స్పందించింది. ఇరుదేశాల మధ్యనున్న ఒప్పందం ప్రకారం కనీసం ఏడురోజులకు ముందు దీనిపై సమాచారమిచ్చిపుచ్చుకోవాలని భారత్ గుర్తు చేసింది. దీనిద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ముందస్తుగా ప్రారంభించే అవకాశం ఉంటుందని తెలిపింది. పాకిస్తాన్ ఇచ్చిన ఆఫర్‌పై సమాలోచనలు జరిపిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని బదులిచ్చింది. కరోనా కారణంగా మూసేసిన ఈ కారిడార్ తెరిచేందుకు ప్రతిపాదన చేసి ఆ […]
న్యూఢిల్లీ: సోమవారం(జూన్ 29) నుంచి కర్తార్‌పూర్ కారిడార్ తెరుస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. అకాస్మత్తుగా చేసిన ఈ ప్రకటనపై భారత్ కూడా స్పందించింది. ఇరుదేశాల మధ్యనున్న ఒప్పందం ప్రకారం కనీసం ఏడురోజులకు ముందు దీనిపై సమాచారమిచ్చిపుచ్చుకోవాలని భారత్ గుర్తు చేసింది. దీనిద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ముందస్తుగా ప్రారంభించే అవకాశం ఉంటుందని తెలిపింది. పాకిస్తాన్ ఇచ్చిన ఆఫర్‌పై సమాలోచనలు జరిపిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని బదులిచ్చింది. కరోనా కారణంగా మూసేసిన ఈ కారిడార్ తెరిచేందుకు ప్రతిపాదన చేసి ఆ దేశానికి సానుకూల అభిప్రాయాన్ని కూడగట్టుకోవడానికి యత్నిస్తున్నదని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రాంతాలను తెరుస్తున్నారని, కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవడానికి సిద్ధంగా ఉన్నామని భారత్‌కు తెలియజేశామని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ ట్వీట్ చేశారు.