పాక్‌లో నెగెటివ్.. ఇంగ్లండ్‌లో పాజిటివ్
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంది. వచ్చే నెల 5 నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్ కోసం జట్టు సభ్యులు ముందుగానే ఆతిథ్య దేశానికి చేరుకున్నారు. అక్కడికి బయలుదేరడానికి ముందు పాకిస్తాన్ క్రికెటర్లకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా, 10మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారిని పర్యటన నుంచి తప్పించి 20మందితో కూడిన జట్టును ఇంగ్లండ్‌కు పంపించారు. ఇంగ్లండ్‌లో ఉన్న పాక్ జట్టులో ఒకరికి ప్రస్తుతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడి స్థానంలో […]
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంది. వచ్చే నెల 5 నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్ కోసం జట్టు సభ్యులు ముందుగానే ఆతిథ్య దేశానికి చేరుకున్నారు. అక్కడికి బయలుదేరడానికి ముందు పాకిస్తాన్ క్రికెటర్లకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా, 10మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారిని పర్యటన నుంచి తప్పించి 20మందితో కూడిన జట్టును ఇంగ్లండ్‌కు పంపించారు. ఇంగ్లండ్‌లో ఉన్న పాక్ జట్టులో ఒకరికి ప్రస్తుతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడి స్థానంలో కాశీఫ్ బట్టీని ఇంగ్లండ్‌కు పంపారు. బయల్దేరకముందు టెస్ట్ చేయగా నెగెటివ్ అని తేలింది. ఇంగ్లండ్‌లో కాశీఫ్‌కు మరోసారి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడిని ఐసోలేషన్‌కు వెళ్లాలని అతడిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కోరింది. వచ్చే నెల 5 నుంచి ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్‌లను బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించనున్నారు.