అడగందే అమ్మైనా అన్నం పెట్టదు.. మేం ఎలా పెడ్తాం ఇమ్రాన్
దిశ,వెబ్‌డెస్క్: అడగందే అమ్మైనా అన్నంపెట్టదు.. అలాగే కేంద్రం కూడా అంతే అడగకుండా పాకిస్తాన్ కు కరోనా వ్యాక్సిన్ ఇవ్వదు కదా..! భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ మాకు కావాలంటే మాకు కావాలంటూ ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇష్టపడడం లేదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్పటికే మనదేశానికి చెందిన కరోనా వ్యాక్సిన్లను భూటాన్, మాల్దీవులు, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు పంపించినట్లు […]
దిశ,వెబ్‌డెస్క్: అడగందే అమ్మైనా అన్నంపెట్టదు.. అలాగే కేంద్రం కూడా అంతే అడగకుండా పాకిస్తాన్ కు కరోనా వ్యాక్సిన్ ఇవ్వదు కదా..! భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ మాకు కావాలంటే మాకు కావాలంటూ ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇష్టపడడం లేదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్పటికే మనదేశానికి చెందిన కరోనా వ్యాక్సిన్లను భూటాన్, మాల్దీవులు, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు పంపించినట్లు చెప్పిన అనురాగ్ శ్రీవాస్తవ.. తమకు కరోనా వ్యాక్సిన్ కావాలని పాక్ ఇప్పటి వరకు కేంద్రంతో సంప్రదింపులు జరపలేదన్నారు.
ఇప్పటికే ప్రధాని భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కరోనా వైరస్ నుంచి ప్రజల్ని రక్షించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పిన అనురాగ్ జనవరి 19న మనదేశం ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్లను పంపాలని మోడీ ఆదేశించారని అన్నారు. మోడీ ఆదేశాలతో జనవరి 20నాటికి భూటాన్ తో పాటు మాల్దీవుస్ కు సుమారు 1.5లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్లను పంపిణీచేసినట్లు వివరించారు. శుక్రవారం రోజు నేపాల్ కు 10లక్షల డోసులు, బంగ్లాదేశ్ కు 20లక్షల డోస్ లు, మయన్మార్ కు 15లక్షల డోసులు, ఈస్ట్ ఏషియా దేశాలకు చెందిన సీషెల్స్‌కు 50వేల డోసుల్ని ప్రత్యేకంగా విమాన మార్గం ద్వారా పంపించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు.