సరిహద్దులు మూసేసిన పాక్

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకి కరోనా(కోవిద్-19) విస్తరిస్తుండడంతో ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దులను వారం రోజుల పాటు మూసేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బలూచిస్థాన్‌లోని చమాన్ వద్ద ఉన్నసరిహద్దు సోమవారం నుంచి మూతపడనుంది. ఇప్పటికే పాక్‌లో నాలుగు పాజిటివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇరు దేశాల సమ్మతితోనే సరిహద్దును మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ అంతర్గత వ్యవహారాల […]

Update: 2020-03-01 20:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకి కరోనా(కోవిద్-19) విస్తరిస్తుండడంతో ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దులను వారం రోజుల పాటు మూసేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బలూచిస్థాన్‌లోని చమాన్ వద్ద ఉన్నసరిహద్దు సోమవారం నుంచి మూతపడనుంది. ఇప్పటికే పాక్‌లో నాలుగు పాజిటివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇరు దేశాల సమ్మతితోనే సరిహద్దును మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది.

Tags:    

Similar News