ఆక్సిజన్ పార్క్ పనులు పూర్తి చేయాలి
దిశ, వరంగల్: రాంపూర్‌లోని ఆక్సిజన్ పార్క్ సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ ప్రమీల సత్పతి ఆదేశించారు. మంగళవారం రాంపూర్‌లోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆక్సిజన్ పార్క్‌ను ఆమె ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు నిమిత్తం జిల్లా కలెక్టర్ 98 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ఆక్సిజన్ పార్క్‌లో సుందరీకరణ జరగాలన్నారు. […]
దిశ, వరంగల్: రాంపూర్‌లోని ఆక్సిజన్ పార్క్ సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ ప్రమీల సత్పతి ఆదేశించారు. మంగళవారం రాంపూర్‌లోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆక్సిజన్ పార్క్‌ను ఆమె ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు నిమిత్తం జిల్లా కలెక్టర్ 98 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ఆక్సిజన్ పార్క్‌లో సుందరీకరణ జరగాలన్నారు. ఎవరైనా అక్రమ లే అవుట్లు చేసినట్లయితే నిబంధనల మేరకు కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, నిరంతరం క్షేత్రస్థాయిలో పర్య వేక్షించాలని అధికారులను ఆదేశించారు
Tags: Oxygen park, rampur, gwmc commissioner, warangal