అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యాలు : సీఎస్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రులలోని అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇందుకోసం తగినన్నీ ఆక్సిజన్ ట్యాంకర్లు కూడా సేకరించబడ్డాయని, అంతేకాకుండా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టెండర్లు కూడా పిలిచినట్లు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఏర్పాటు చేసిన వెబినార్‌లో బీ.ఆర్.కె.ఆర్. భవన్ నుండి ఆయన పాల్గొన్నారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కొన్ని వినూత్న చర్యలు తీసుకుందని, […]
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రులలోని అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇందుకోసం తగినన్నీ ఆక్సిజన్ ట్యాంకర్లు కూడా సేకరించబడ్డాయని, అంతేకాకుండా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టెండర్లు కూడా పిలిచినట్లు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఏర్పాటు చేసిన వెబినార్‌లో బీ.ఆర్.కె.ఆర్. భవన్ నుండి ఆయన పాల్గొన్నారు.
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కొన్ని వినూత్న చర్యలు తీసుకుందని, ఫలితంగా దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా కేసులు నమోదవడం మాత్రమే కాకుండా మరణాలు కూడా తక్కువ సంభవించాయన్నారు. థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా పూర్తిగా సన్నద్ధమైందని వివరించారు. సీఎం కేసీఆర్ గాంధీ, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులను సందర్శించడంతో రోగుల్లో, డాక్టర్లలో మనోస్థైర్యాన్ని పెంచిందన్నారు. టీకా కార్యక్రమాన్ని సీఎస్ ప్రస్తావిస్తూ.. భారత ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వం హైఎక్స్ పోజర్ గ్రూప్‌లో ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ప్రాతిపదికన టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.