పరిశ్రమలకు ఆక్సిజన్ బంద్
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ముందస్తు చర్యలు చేపట్టింది. పరిశ్రమలకు సరఫరా చేసే ఆక్సిజన్ను నిలుపుదల చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టీల్, తదితర పరిశ్రమలో యంత్రాలకు ఆక్సిజన్‌ను ఉపయోగిస్తారు. అయితే కరోనా ఉధృతి నేపథ్యంలో రోగులకు ఆక్సిజన్ అందజేయాలనే లక్ష్యంతో పరిశ్రమలకు సరఫరాను నిలిపివేసింది. ఎవరైనా నిబంధనలు విరుద్ధంగా వాడితే చర్యలు […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ముందస్తు చర్యలు చేపట్టింది. పరిశ్రమలకు సరఫరా చేసే ఆక్సిజన్ను నిలుపుదల చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టీల్, తదితర పరిశ్రమలో యంత్రాలకు ఆక్సిజన్‌ను ఉపయోగిస్తారు. అయితే కరోనా ఉధృతి నేపథ్యంలో రోగులకు ఆక్సిజన్ అందజేయాలనే లక్ష్యంతో పరిశ్రమలకు సరఫరాను నిలిపివేసింది. ఎవరైనా నిబంధనలు విరుద్ధంగా వాడితే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులో పేర్కొన్నారు