వచ్చే వారంలో ఆక్స్‌ఫర్డ్ టీకా రెండో దశ ట్రయల్స్

దిశ, వెబ్ డెస్క్: సమస్త ప్రపంచం ఆతృతగా చూస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకా (oxford vaccine) రెండో దశ ట్రయల్స్ భారత్‌లో వచ్చేవారంలో ప్రారంభం కానున్నాయి. మూడు నుంచి నాలుగు సైట్‌లలో సోమవారం నుంచి టీకాను వాలంటీర్లకు ప్రయోగించనున్నట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. రెగ్యులేటరీ క్లియరెన్స్‌ల కోసం కేంద్రం ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిని అవలంభించిన విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్ కోసం 14 సైట్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో ముంబయి, పూణెలోని నాలుగు సైట్లు సిద్ధమయ్యాయి. ఈ సైట్లలో సోమవారం లేదా […]

Update: 2020-08-24 09:11 GMT

దిశ, వెబ్ డెస్క్: సమస్త ప్రపంచం ఆతృతగా చూస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకా (oxford vaccine) రెండో దశ ట్రయల్స్ భారత్‌లో వచ్చేవారంలో ప్రారంభం కానున్నాయి. మూడు నుంచి నాలుగు సైట్‌లలో సోమవారం నుంచి టీకాను వాలంటీర్లకు ప్రయోగించనున్నట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. రెగ్యులేటరీ క్లియరెన్స్‌ల కోసం కేంద్రం ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిని అవలంభించిన విషయం తెలిసిందే.

ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్ కోసం 14 సైట్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో ముంబయి, పూణెలోని నాలుగు సైట్లు సిద్ధమయ్యాయి. ఈ సైట్లలో సోమవారం లేదా మంగళవారం ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్ ప్రారంభమవుతున్నట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయనున్న విషయం విదితమే.

Tags:    

Similar News