కరోనా నివారణకు ఆస్ట్రాజెనెకానే మేలు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించి ఇటీవల పలు కంపెనీలు సానుకూల సంకేతాలను అందిస్తున్నాయి. ఇప్పటికే మోడెర్నా, ఫైజర్ కంపెనీలు తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌లు 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు వెల్లడించాయి. అయితే, ఫైజర్ వ్యాక్సిన్ మెరుగైన సామర్థ్యాన్ని చూపించినప్పటికీ, పలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు పంపిణీ చేయడంలో సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఫైజర్ వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు, రవాణా చేసేందుకూ మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించి ఇటీవల పలు కంపెనీలు సానుకూల సంకేతాలను అందిస్తున్నాయి. ఇప్పటికే మోడెర్నా, ఫైజర్ కంపెనీలు తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌లు 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు వెల్లడించాయి. అయితే, ఫైజర్ వ్యాక్సిన్ మెరుగైన సామర్థ్యాన్ని చూపించినప్పటికీ, పలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు పంపిణీ చేయడంలో సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రధానంగా ఫైజర్ వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు, రవాణా చేసేందుకూ మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా 70 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని కంపెనీ సోమవారం వెల్లడించింది. క్లినికల్ పరీక్షల విషయమై వాలంటీర్లలో సగటున 70 శాతం మందిని తమ వ్యాక్సిన్ కొవిడ్-19 నుంచి కాపాడినట్టు కంపెనీ తెలిపింది.
క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు సంబంధించి సంస్థ అధికారులు 2 రకాల డోసులను ఇచ్చారు. మొదటిసారి సగం డోసును ఇవ్వగా, తర్వాత పూర్తి డోసును ఇచ్చారు. దీంతో వ్యాక్సిన్ 90 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ డోసులకు సంబంధించి రెండవ విధానంలో 62 శాతం సామర్థ్యం కలిగి ఉన్నట్టు వెల్లడైంది. సగం డోసును వాడగా, దాని సామర్థ్యం 90 శాతంగా నమోదవడం గర్వంగా ఉందని ఆస్ట్రాజెనెకా సంస్థ ప్రతినిధి చెప్పారు. ఈ ఫలితాలు అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయని, వ్యాక్సిన్ విషయంలో ఈ విధానాన్నే అవలంబించేలా పలు దేశాల డ్రగ్ కంట్రోల్ కంపెనీలకు సూచించనున్నట్టు కంపెనీ తెలిపింది.
తక్కువ ధరకే…
ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ఎక్కువ దేశాలు ఆశాభావం వ్యక్తం చేయడానికి ధర ప్రధాన కారణం. కొవిడ్-19 లాంటి మహమ్మారి కొనసాగుతున్న సమయంలో లాభాలను చూడటంలేదని ఆస్ట్రాజెనెకా స్పష్టం చేసింది. కావున, ఒక్క డోసుకు కేవలం 4 నుంచి 5 డాలర్లు మాత్రమే వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. మోడెర్నా, ఫైజర్ లాంటి వ్యాక్సిన్ ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువకే లభిస్తున్నది. పైగా, కోవాక్సిన్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుంటే మరింత తక్కువ అంటే 3 డాలర్ల లోపు కూడా లభించే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ ఒక డోసుకు 19.50 డాలర్లను చెల్లించేలా యూఎస్ ఒప్పందాన్ని చేసుకుంది. మోడెర్నా ఒక డోసు 27 డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
పంపిణీ కలిసొస్తోంది…
ఫైజర్, మోడెర్నా లాంటి వ్యాక్సిన్‌ల కంటే ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సమర్థత తక్కువగా ఉన్నప్పటికీ..వ్యాక్సిన్ పంపిణీలో ఉన్న సౌలభ్యం వల్ల ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ భారత్ లాంటి దేశాలకు అనువైనవిగా ఉంటాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సాధారణంగా ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్‌లలో కూడా నిల్వ చేసుకునే వీలుంటుంది. అందుకే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు డిమాండ్ అధికంగా ఉంది.
సాధారణ శీతలీకరణ వ్యవస్థలున్న భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ సరైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా, భారత కరెన్సీలో కేవలం రూ. వెయ్యికే లభించనున్నడం కూడా మరో కారణమని అంటున్నారు. ఈ క్రమంలో క్లినికల్ పరీక్షలకు సంబంధించి వివరాలను, సమాచారాన్ని పలు దేశాల ఔషధ నియంత్రణ సంస్థలకు ఇచ్చి, పంపిణీకి అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేయనున్నట్టు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.