తెలంగాణకు చేరుకున్న పదో ఆక్సిజన్ రైలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఒరిస్సాలోని రూర్కెలా నుంచి ఆరు కంటైనర్లలో 118.93 టన్నుల ప్రాణవాయువుతో బయలుదేరిన పదో ఆక్సీజన్ రైలు శనివారం తెలంగాణకు చేరుకుంది. హైదరాబాద్ లోని సనత్ నగర్ కు ఈ ట్యాంకర్లు చేరుకున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, కృష్ణపట్నం ప్రాంతాలకు సైతం రెండు ఆక్సీజన్ ఎక్స్ ప్రెస్ లు చేరకున్నాయి. మూడో ఆక్సీజన్ ఎక్స్ ప్రెస్ పశ్చిమబెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి రెండు ట్యాంకర్లలో 40 టన్నుల ప్రాణవాయువు గుంటూరుకు చేరుకుంది. అలాగే […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఒరిస్సాలోని రూర్కెలా నుంచి ఆరు కంటైనర్లలో 118.93 టన్నుల ప్రాణవాయువుతో బయలుదేరిన పదో ఆక్సీజన్ రైలు శనివారం తెలంగాణకు చేరుకుంది. హైదరాబాద్ లోని సనత్ నగర్ కు ఈ ట్యాంకర్లు చేరుకున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, కృష్ణపట్నం ప్రాంతాలకు సైతం రెండు ఆక్సీజన్ ఎక్స్ ప్రెస్ లు చేరకున్నాయి. మూడో ఆక్సీజన్ ఎక్స్ ప్రెస్ పశ్చిమబెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి రెండు ట్యాంకర్లలో 40 టన్నుల ప్రాణవాయువు గుంటూరుకు చేరుకుంది. అలాగే ఐదో ఆక్సీజన్ ఎక్స్ ప్రెస్ ఒరిస్సాలోని రూర్కెలా నుంచి నాలుగు ట్యాంకర్లలో 75.75 టన్నులతో చేరుకుంది. ఇదిలా ఉండగా ఆక్సీజన్ ఎక్స్‌ప్రెస్ లను గమ్యస్థానాలకు సాధ్యమైనంత త్వరగా చేరేలా కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు.