ఆ దేశస్తులకు ఇండియాలో ఎంట్రీ : కేంద్ర హోంశాఖ

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తున్నాయి. అదే సమయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో ఓసీఐ (ఓవర్ సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా) కార్డు కలిగిన వారిని భారత్‌లోకి అనుమతిస్తామని హోమ్ శాఖ ప్రకటించింది. అంతే కాకుండా విదేశీయులను కూడా వ్యాపార, ఆరోగ్య రంగాల, ఉద్యోగాల నిమిత్తం అనుమతిస్తామని తెలిపింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలతో భారత్‌కు […]

Update: 2020-08-08 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తున్నాయి. అదే సమయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో ఓసీఐ (ఓవర్ సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా) కార్డు కలిగిన వారిని భారత్‌లోకి అనుమతిస్తామని హోమ్ శాఖ ప్రకటించింది.

అంతే కాకుండా విదేశీయులను కూడా వ్యాపార, ఆరోగ్య రంగాల, ఉద్యోగాల నిమిత్తం అనుమతిస్తామని తెలిపింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలతో భారత్‌కు ద్వైపాక్షిక, వైమానిక సంబంధ ఒప్పందాలు ఉన్నాయి. దాంతో ఆయా దేశాలకు వెళ్లేందుకు ఎలాంటి వీసాపై ఐన అనుమతిస్తున్నట్లు కేంద్రం హోంశాఖ స్పష్టంచేసింది.

ఇదిలాఉండగా కరోనా విజృంభణ నేపథ్యంలో ఇతర దేశాలకు వెళ్ళేందుకు ప్రయాణ ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల ద్వారా ఇండియాకు వచ్ఛే ప్రయాణికులపై మాత్రం ఆంక్షలు ఉంటాయని కేంద్ర హోంశాఖ మరోసారి తెలిపింది.

Tags:    

Similar News