హెల్ప్ కోసం ఫోన్ నెంబర్లు @భద్రాచలం
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. గురువారం రాత్రి నుంచి మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 54.50 అడుగులతో ప్రవాహం కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డా. ఎంవీ రెడ్డి తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు వాగులు దాటే ప్రయత్నాలు చేయకుండా నియంత్రణ చేయాలని చెప్పారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్ 08744241950, ఆర్డీఓ కార్యాలయం కొత్తగూడెం […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. గురువారం రాత్రి నుంచి మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 54.50 అడుగులతో ప్రవాహం కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డా. ఎంవీ రెడ్డి తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు వాగులు దాటే ప్రయత్నాలు చేయకుండా నియంత్రణ చేయాలని చెప్పారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్ 08744241950, ఆర్డీఓ కార్యాలయం కొత్తగూడెం 08744249994, సబ్ కలెక్టర్ భద్రాచలం 08743232444, ఐటీడీఏ భద్రాచలంలో ఏర్పాటు చేసిన 08743232244, 9391052395 ప్రత్యేక కంట్రోల్ రూం నెంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.