కాంట్రాక్టు ఉద్యోగుల రిటైర్మెంట్ ను 61ఏళ్లకు పెంచండి

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచిన మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీకాలన్నీ పెంచాలని టూరిజం అభివృద్ధి సంస్థ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సబ్బు రాజమౌళి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. నాల్గవ తరగతి ఉద్యోగులకు పాత జీవో ప్రకారం 60 సంవత్సరాలకు ఉండేదని కానీ 58 ఏళ్లకే రిటైర్మెంట్ ఇస్తున్నారని ఆయన తెలిపారు. అందువల్ల […]

Update: 2021-08-13 11:25 GMT

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచిన మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీకాలన్నీ పెంచాలని టూరిజం అభివృద్ధి సంస్థ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సబ్బు రాజమౌళి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. నాల్గవ తరగతి ఉద్యోగులకు పాత జీవో ప్రకారం 60 సంవత్సరాలకు ఉండేదని కానీ 58 ఏళ్లకే రిటైర్మెంట్ ఇస్తున్నారని ఆయన తెలిపారు. అందువల్ల ఉద్యోగులమంతా చాలా నష్టపోతున్నామని పేర్కొన్నారు. కావున కాంట్రక్లు ఉద్యోగులకు కూడా 61 ఏళ్లకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

 

 

Tags:    

Similar News