క్రైస్తవుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి మల్లారెడ్డి 

దిశ, ప్రతినిధి,మేడ్చల్: క్రైస్తవుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ నియోజకవర్గంలో కీసర, మేడ్చల్, జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడ, తూంకుంట, గుండ్లపోచంపల్లి లకు చెందిన క్రిస్టియన్లకు ప్రభుత్వం తరపున క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో క్రిస్మస్ పండుగకు కొత్త బట్టలు ఇస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ […]

Update: 2021-12-21 08:26 GMT

దిశ, ప్రతినిధి,మేడ్చల్: క్రైస్తవుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ నియోజకవర్గంలో కీసర, మేడ్చల్, జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడ, తూంకుంట, గుండ్లపోచంపల్లి లకు చెందిన క్రిస్టియన్లకు ప్రభుత్వం తరపున క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో క్రిస్మస్ పండుగకు కొత్త బట్టలు ఇస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మతాలను సమదృష్టితో చూస్తున్నట్లు తెలిపారు. ఆ దేవుని కృప ప్రతి ఒక్కరి పై ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ సోదరుల సంక్షేమానికి కృషి చేస్తుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, కీసర ఆర్డీవో రవి, జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, ప్రణీత శ్రీకాంత్ గౌడ్, రాజేశ్వరరావు, దీపికా నర్సింహారెడ్డి, లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్లు మల్లేష్, నరేందర్ రెడ్డి, వాణి వీరారెడ్డి, ప్రభాకర్, జడ్పీటీసీ శైలజ విజయనంద్ రెడ్డి, ఎంపీపీలు ఇందిరా లక్ష్మీ నారాయణ, పద్మా జగన్ రెడ్డి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, శ్రీధర్, తిరుపతి రెడ్డి, కొండల్, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ గౌడ్, సంజీవ, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News