కృనాల్ ఎమోషనల్.. మా నాన్న ఉంటే..

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా తరపున కృనాల్ పాండ్యా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తమ్ముడు హార్దిక్ పాండ్యా నుంచి క్యాప్ అందుకున్న కృనాల్ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ ఆసాంతం కృనాల్ అలాగే కనిపించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అర్దసెంచరీ బాది టీమ్ ఇండియా భారీ స్కోర్‌కు దోహదపడ్డాడు. అయితే భారత జట్టు మ్యాచ్ గెలిచిన అనంతరం పాండ్యా బ్రదర్స్ చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కృనాల్ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనను నాన్నకు […]

Update: 2021-03-24 08:51 GMT

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా తరపున కృనాల్ పాండ్యా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తమ్ముడు హార్దిక్ పాండ్యా నుంచి క్యాప్ అందుకున్న కృనాల్ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ ఆసాంతం కృనాల్ అలాగే కనిపించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అర్దసెంచరీ బాది టీమ్ ఇండియా భారీ స్కోర్‌కు దోహదపడ్డాడు. అయితే భారత జట్టు మ్యాచ్ గెలిచిన అనంతరం పాండ్యా బ్రదర్స్ చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కృనాల్ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనను నాన్నకు అంకితమిస్తున్నానని చెప్పాడు.

‘ఆయన 16వ తేదీ ఉదయం మరణించారు. ఆ రోజు ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్నాను. ఇంటికి రాగానే చాలా ఏడుపు వచ్చింది. మా నాన్నకు ఒక అలవాటు ఉంది. తర్వాత రోజు ఏ దుస్తులు వేసుకోవాలో ముందు రోజే సిద్దం చేసుకుంటారు. అలా నాన్న సిద్దం చేసుకున్న సిద్దులు అలాగే ఉన్నాయి. దాన్ని నేను నాన్న బ్యాగులో పెట్టుకొని ఇక్కడకు తీసుకొని వచ్చాను. డ్రెస్సింగ్ రూంలో ఆ బ్యాగు, దుస్తులు ఉంచినప్పుడు ఆయనే స్వయంగా మ్యాచ్ వీక్షిస్తున్నాడని భావించాను’ అంటూ తండ్రిని మరోసారి గుర్తుచేసుకుంటూ కృనాల్ ఎమోషనల్ అయ్యాడు.

Tags:    

Similar News