ఎట్టకేలకు ఆందోళన విరమణ

దిశ ప్రతినిధి, హైదరాబాద్: మూడు రోజులుగా ఆందోళనబాట పట్టిన ఉస్మానియా ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ నర్సులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. బుధవారం తెలంగాణ మెడికల్ జాక్ సహకారంతో హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో జరిపిన చర్చలు సఫలంకావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు నర్సింగ్ సమితి అధ్యక్షుడు కుర్మేటి గోవర్ధన్ వెల్లడించారు. నర్సులకు 4 నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదని, ఇదేంటని అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతుండటంతో విధులు బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని డిమాండ్ […]

Update: 2020-07-29 09:05 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: మూడు రోజులుగా ఆందోళనబాట పట్టిన ఉస్మానియా ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ నర్సులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. బుధవారం తెలంగాణ మెడికల్ జాక్ సహకారంతో హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో జరిపిన చర్చలు సఫలంకావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు నర్సింగ్ సమితి అధ్యక్షుడు కుర్మేటి గోవర్ధన్ వెల్లడించారు.

నర్సులకు 4 నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదని, ఇదేంటని అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతుండటంతో విధులు బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 27 నుంచి నర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News