అనాథపిల్లలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ బిడ్డలు

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇక అనాథలు ఉండరని వారంతా రాష్ట్ర ప్రభుత్వ బిడ్డలు(చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్)గా పరిగణించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. హైదరాబాద్ లోని సైదాబాద్, నిమ్బోలిఅడ్డ ప్రాంతాలలో రూ. 7.65 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బాలబాలికల హోమ్స్ లను శుక్రవారం మంత్రి సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం ప్రారంభించారు. హోమ్స్ లలో ఉండే పిల్లలకు అన్నీ తానై చూసుకునే విధంగా కేబినెట్ సబ్ […]

Update: 2021-08-13 11:39 GMT

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇక అనాథలు ఉండరని వారంతా రాష్ట్ర ప్రభుత్వ బిడ్డలు(చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్)గా పరిగణించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. హైదరాబాద్ లోని సైదాబాద్, నిమ్బోలిఅడ్డ ప్రాంతాలలో రూ. 7.65 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బాలబాలికల హోమ్స్ లను శుక్రవారం మంత్రి సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం ప్రారంభించారు. హోమ్స్ లలో ఉండే పిల్లలకు అన్నీ తానై చూసుకునే విధంగా కేబినెట్ సబ్ కమిటీని సీఎం కేసిఆర్ ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి సత్యవతి పేర్కొన్నారు.

హోమ్స్ లో ఉండే అనాథలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా వారికి కుటుంబం ఏర్పడే వరకూ అన్ని విధాలుగా అండగా ఉండే బాధ్యతలు తీసుకోబోతుందని తెలపారు. వీరి సంక్షేమం, రక్షణ, భద్రత, భవిష్యత్ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందున్నారు. ఈ కార్యక్రమంలో బాల నేరస్తుల శాఖ డైరెక్టర్ శ్రీమతి శైలజ, స్థానిక కార్పొరేటర్లు శ్రీమతి కొత్తకాపు అరుణ, శ్రీమతి దూసరి లావణ్య, ఇతర అధికారులు నేతలు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News