ఆ ముగ్గురిని… విచారించిన పోలీసులు

దిశ, పటాన్‌చెరు: అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మారుతీ అనాథాశ్రమంలో మైనర్ బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటనలో ముగ్గురు నిందితులు వేణుగోపాల్ రెడ్డి, విజయ, జయదేవ్‌లను రెండో రోజు పటాన్‌చెరు డీఎస్పీ కార్యాలయంలో హైపవర్ విచారణ కమిటీ, పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వరరావు నేతృత్వంలో విచారించారు. హైపవర్ కమిటీ బాలికలతో విడివిడిగా విచారణ కొనసాగిస్తుండగానే, పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేయగా, కోర్టు రెండ్రోజుల పాటు విచారణకు ఆదేశించగా గడువు ముగిసింది. మంగళవారం నిందితులను […]

Update: 2020-08-18 07:38 GMT

దిశ, పటాన్‌చెరు: అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మారుతీ అనాథాశ్రమంలో మైనర్ బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటనలో ముగ్గురు నిందితులు వేణుగోపాల్ రెడ్డి, విజయ, జయదేవ్‌లను రెండో రోజు పటాన్‌చెరు డీఎస్పీ కార్యాలయంలో హైపవర్ విచారణ కమిటీ, పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వరరావు నేతృత్వంలో విచారించారు.

హైపవర్ కమిటీ బాలికలతో విడివిడిగా విచారణ కొనసాగిస్తుండగానే, పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేయగా, కోర్టు రెండ్రోజుల పాటు విచారణకు ఆదేశించగా గడువు ముగిసింది. మంగళవారం నిందితులను విచారించిన తర్వాత పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ముగ్గురు నిందితులను సాయంత్రం కంది జైలుకు తరలించారు.

Tags:    

Similar News