ప్రత్యేక పశు వైద్య శిబిరాలు నిర్వహించాలి

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పశువులు కలుషిత నీరు తాగి వివిధ రకాల సీజనల్ వ్యాధులతో చనిపోయే అవకాశాలున్నాయని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి హెచ్చరించారు. జిల్లా, మండలస్థాయి పశు వైద్యాధికారులు రైతులకు అందుబాటులో ఉండి ప్రత్యేక పశు వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులతో మాట్లాడుతూ ఇప్పటికే అన్నిసీజనల్ వ్యాధులకు టీకాలు ఇచ్చామని, ఇంకా అవసరమైన టీకా మందులు అన్ని పశు వైద్యశాలల్లో […]

Update: 2020-10-22 09:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పశువులు కలుషిత నీరు తాగి వివిధ రకాల సీజనల్ వ్యాధులతో చనిపోయే అవకాశాలున్నాయని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి హెచ్చరించారు. జిల్లా, మండలస్థాయి పశు వైద్యాధికారులు రైతులకు అందుబాటులో ఉండి ప్రత్యేక పశు వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులతో మాట్లాడుతూ ఇప్పటికే అన్నిసీజనల్ వ్యాధులకు టీకాలు ఇచ్చామని, ఇంకా అవసరమైన టీకా మందులు అన్ని పశు వైద్యశాలల్లో అందుబాటులో ఉంచామన్నారు. దీని కోసం రూ. 2కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించారన్నారు. అత్యవసర పరిస్థితులలో 1962 సంచార పశువైద్య శాలల సేవలు ఉంటాయని, ప్రస్తుత భారి వర్షాలతో చనిపోయిన పశు సంపద వివరాలను వెంటనే తెలుపాలన్నారు.

Tags:    

Similar News