కేసీఆర్‌కు బహిరంగ లేఖ

దిశ, న్యూస్‌బ్యూరో : హైకోర్టు చెప్పిన విధంగా విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తక్షణమే జీవో 45 పై జోక్యం చేసుకొని ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్నఉద్యోగులకు ఆదాయభద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు శుక్రవారం ప్రతిపక్ష నాయకులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, టీ టీడీపీ ఎల్. రమణలు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. […]

Update: 2020-07-24 12:00 GMT

దిశ, న్యూస్‌బ్యూరో : హైకోర్టు చెప్పిన విధంగా విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తక్షణమే జీవో 45 పై జోక్యం చేసుకొని ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్నఉద్యోగులకు ఆదాయభద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు శుక్రవారం ప్రతిపక్ష నాయకులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, టీ టీడీపీ ఎల్. రమణలు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లిందని తెలిపారు. సామాజిక, ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలిపొయాని పేర్కొన్నారు. మరొకవైపు బతుకుదెరువు కోల్పోయి దుర్భరమైన దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వైద్యాన్ని అందించడంలోనూ, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలకు ఆర్థిక సహకారం అందించడంలోనూ తీవ్రంగా విఫలమైందన్నారు. ఈ కీలక సమయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించాలని, రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని కోరారు.

Tags:    

Similar News