విపక్షాలు ఏకమవ్వాలన్నది శరద్ పవార్ కోరిక..

ముంబై : ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్(పీకే) కిశోర్‌ కనీసం మూడు గంటలపాటు భేటీ కావడంపై మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందించారు. ‘శరద్‌ పవార్‌తో ఆయన నివాసంలో ప్రశాంత్ కిశోర్ మూడు గంటలపాటు భేటీ అయ్యారు. ఎన్సీపీ అతన్ని స్ట్రాటజిస్ట్‌గా నియమించుకోవడం లేదు. పీకేకు పొలిటికల్ డేటా, స్టాటిస్టిక్స్‌పై గట్టి పట్టున్నది. ఆయన తన అనుభవాన్ని పవార్‌తో పంచుకోవచ్చు. ప్రస్తుత రాజకీయాలపైనా చర్చ తప్పక జరిగి ఉంటుంది. పవార్ […]

Update: 2021-06-12 10:41 GMT

ముంబై : ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్(పీకే) కిశోర్‌ కనీసం మూడు గంటలపాటు భేటీ కావడంపై మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందించారు. ‘శరద్‌ పవార్‌తో ఆయన నివాసంలో ప్రశాంత్ కిశోర్ మూడు గంటలపాటు భేటీ అయ్యారు. ఎన్సీపీ అతన్ని స్ట్రాటజిస్ట్‌గా నియమించుకోవడం లేదు. పీకేకు పొలిటికల్ డేటా, స్టాటిస్టిక్స్‌పై గట్టి పట్టున్నది. ఆయన తన అనుభవాన్ని పవార్‌తో పంచుకోవచ్చు. ప్రస్తుత రాజకీయాలపైనా చర్చ తప్పక జరిగి ఉంటుంది. పవార్ సాబ్ విపక్షాలన్నీ ఏకం కావాలని భావిస్తు్న్నారు.

బీజేపీకి ప్రత్యా్మ్నాయంగా కూటమి కోసం కచ్చితంగా కసరత్తు ప్రారంభిస్తారు’ అని మాలిక్ అన్నారు. ‘బెంగాల్‌ ప్రజలు బీజేపీని తిరస్కరించారు. ఇప్పుడు ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలో చేరారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఎంసీలో చేరతారు. యూపీ ప్రజలు బీజేపీని ఇంటికి పంపడానికే నిర్ణయించుకున్నారు’ అని వివరించారు. తమిళనాడులో స్టాలిన్‌ను, బెంగాల్‌లో దీదీని విజయతీరాలకు చేర్చి వ్యూహకర్తగా పీకే మరోసారి నిరూపించుకున్నారని ప్రశంసించారు.

Tags:    

Similar News