ఇంకో రెండు ప్రయత్నాలు.. విఫలమైతే రూ. 1715 కోట్ల నష్టం

దిశ, వెబ్‌డెస్క్ :ఈరోజుల్లో ఒక్కొక్కరికి పది నుంచి ఇరవై వరకు పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతా ఆన్‌లైన్ అవడంతో పాస్‌వర్డ్‌లకు ప్రాముఖ్యత పెరిగింది. అన్నిటికీ ఒకటే పాస్‌వర్డ్ పెడదామా అంటే హ్యాకర్ల భయం. కానీ కొన్నిసార్లు ఈ పాస్‌వర్డ్‌లే కీలక పాత్ర పోషిస్తాయి. కంప్యూటర్ ప్రోగ్రామర్ స్టీఫెన్ థామస్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. ఇంకో రెండు సార్లు అతను తన బిట్‌కాయిన్ ఐరన్‌కీ పాస్‌వర్డ్‌ను తప్పుగా ఎంటర్ చేస్తే రూ. 1715 కోట్లు […]

Update: 2021-01-13 07:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ :ఈరోజుల్లో ఒక్కొక్కరికి పది నుంచి ఇరవై వరకు పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతా ఆన్‌లైన్ అవడంతో పాస్‌వర్డ్‌లకు ప్రాముఖ్యత పెరిగింది. అన్నిటికీ ఒకటే పాస్‌వర్డ్ పెడదామా అంటే హ్యాకర్ల భయం. కానీ కొన్నిసార్లు ఈ పాస్‌వర్డ్‌లే కీలక పాత్ర పోషిస్తాయి. కంప్యూటర్ ప్రోగ్రామర్ స్టీఫెన్ థామస్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. ఇంకో రెండు సార్లు అతను తన బిట్‌కాయిన్ ఐరన్‌కీ పాస్‌వర్డ్‌ను తప్పుగా ఎంటర్ చేస్తే రూ. 1715 కోట్లు నష్టపోనున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఈ జర్మనీ ప్రోగ్రామర్‌కు 2011లో క్రిప్టోకరెన్సీ గురించి ఒక వీడియో చేసినందుకు ఒక బిట్‌కాయిన్‌ను రివార్డుగా పొందాడు. 2020 ప్రారంభం నుంచి బిట్‌కాయిన్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు థామస్ బిట్‌కాయిన్ విలువ 720 శాతం పెరిగింది.

కానీ అప్పట్లో బిట్‌కాయిన్ అన్‌లాక్ పాస్‌వర్డ్‌ను ఏదో పేపర్ మీద రాసుకున్న థామస్.. ఇప్పుడు దాన్ని పోగొట్టుకున్నాడు. బిట్‌కాయిన్‌ను అన్‌లాక్ చేయాలంటే పాస్‌వర్డ్ కావాలి. ఐరన్‌కీ ద్వారా 10 సార్లు పాస్‌వర్డ్‌ను ప్రయత్నించవచ్చు. ఇప్పటికే ఎనిమిది సార్లు థామస్ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎన్నిరకాలుగా ఆలోచించినా పాస్‌వర్డ్ గుర్తుకురాకపోవడంతో ఇక తన ఐరన్‌కీని లాకర్‌లో పెట్టి, పాస్‌వర్డ్‌ను గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ఒక్క థామస్ మాత్రమే కాదు గతంలో బిట్‌కాయిన్ కొని, పాస్‌వర్డ్ మర్చిపోయిన మహానుభావుల కారణంగా ఇప్పుడు క్రిప్టో ప్రపంచంలో కుప్పల కొద్దీ క్రిప్టో కరెన్సీ గుర్తింపు లేకుండా కొట్టామిట్టాడుతోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పాస్‌వర్డ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.

Tags:    

Similar News