ఫ్లాష్‌సేల్స్ నిషేధంపై ఆన్‌లైన్ వినియోగదారుల అసంతృప్తి

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ఈ-కామర్స్ కంపెనీలు భారీగా డిస్కౌంట్లను ఇచ్చే ‘డిస్కౌంట్ సేల్’ ను నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆన్‌లైన్ వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల లోకల్‌ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ-కామర్స్ కంపెనీలు నిర్వహించే అమ్మకాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోనవసరం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తేలింది. ఈ సర్వేలో ఆన్‌లైన్ వినియోగదారులలో 72 శాతం మంది ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఫ్లాష్‌సేల్ నిర్వహణపై నిషేధం వద్దన్నారు. అలాగే, ఆన్‌లైన్ షాపింగ్ […]

Update: 2021-07-21 09:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ఈ-కామర్స్ కంపెనీలు భారీగా డిస్కౌంట్లను ఇచ్చే ‘డిస్కౌంట్ సేల్’ ను నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆన్‌లైన్ వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల లోకల్‌ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ-కామర్స్ కంపెనీలు నిర్వహించే అమ్మకాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోనవసరం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తేలింది. ఈ సర్వేలో ఆన్‌లైన్ వినియోగదారులలో 72 శాతం మంది ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఫ్లాష్‌సేల్ నిర్వహణపై నిషేధం వద్దన్నారు. అలాగే, ఆన్‌లైన్ షాపింగ్ ప్రధాన కొనుగోలు మార్గంగా ఉందని 49 శాతం చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారందరిలో ఎక్కువ మంది సౌకర్యాలతో పాటు భద్రత కూడా ఉండటం వల్లనే ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా ఈ-కామర్స్ మధ్య పోటీతత్వం వల్ల తక్కువ ధరలో వస్తువులను కొనుగోలు చేయగలుగుతున్నామని, రెటర్న్ చేసే వెసులుబాటు ఉండటంపై సంతృప్తిగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇలాంటి ఫ్లాష్‌సేల్ వల్ల మరింత చౌకగా కొనగలుగుతున్నామని, ఖర్చులను నియంత్రిస్తూ ఆదాయ చేయగలుగుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఆదా చేసుకునే డబ్బు ఎంతో విలువైనదని వారు వివరించారు. అదే సమయంలో ఆన్‌లైన్ కొనుగోలు చేసే వస్తువులపై ఏ దేశం నుంచి ఆ వస్తువులు వస్తున్నాయనే సమాచారం ఉండాలని 42 శాతం మంది వెల్లడించారు.

Tags:    

Similar News