లాక్‌డౌన్‌కి ఏడాది.. ఇప్పటికీ ఏం మారలే..
దిశ, వెబ్‌డెస్క్: అది 2020, మార్చి 24. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రజల్లో ఒకటే భయం.. బయటికి రావాలంటే భయపడే పరిస్థితులు.. అప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దేశంలో కూడా లాక్‌డౌన్ విధించే అవకాశమున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. అదే క్రమంలో మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రజలందరూ స్వచ్ఛంధంగా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రజలందరూ బయటికి రాకుండా ఇంట్లోని ఉండి స్వచ్చంధంగా కర్ఫ్యూ […]
దిశ, వెబ్‌డెస్క్: అది 2020, మార్చి 24. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రజల్లో ఒకటే భయం.. బయటికి రావాలంటే భయపడే పరిస్థితులు.. అప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దేశంలో కూడా లాక్‌డౌన్ విధించే అవకాశమున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. అదే క్రమంలో మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రజలందరూ స్వచ్ఛంధంగా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రజలందరూ బయటికి రాకుండా ఇంట్లోని ఉండి స్వచ్చంధంగా కర్ఫ్యూ పాటించారు. దానితో జనతా కర్ఫ్యూ సక్సెస్ అయినట్లు అయింది.
ఆ తర్వాత మార్చి 24న సాయంత్రం 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజల్లో ఒకటే ఆందోళన.. లక్షలాది మంది వలస కార్మికులు రోడ్డున పడ్డారు. లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కంపెనీలన్నీ తీవ్ర నష్టాలపాలయ్యాయి. ఉపాధి కోల్పోయి లాక్‌డౌన్‌లో జనం పడిన ఇబ్బందులు అంతా.. ఇంతా కాదు.
లాక్‌డౌన్‌కు నేటికి సరిగ్గా ఏడాది అయింది. అయినా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోంను అలాగే కొనసాగిస్తున్నాయి. ఉపాధి కోల్పోయిన వారికి ఇంకా ఉపాధి లభించలేదు. కంపెనీలు నష్టాల నుంచి ఇంకా కోలుకోలేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి.