త‌మిళ‌నాడులో వారంపాటు సంపూర్ణ లాక్ డౌన్

దిశ, వెబ్‌డెస్క్ : త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కేసులు పెరుగుతున్న కార‌ణంగా రాష్ట్రంలో వారంరోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించాల‌ని సీఎం స్టాలిన్ నిర్ణ‌యం తీసుకున్నారు. మే 10 నుంచి మే 24 వ‌ర‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించింది. మ‌రో రెండు రోజుల్లో ఆ గ‌డువు ముగుస్తుండ‌టంతో.. ఇప్పుడు వారంపాటు క‌ఠిన లాక్ డౌన్ విధించాల‌ని నిర్ణ‌యించింది. ఇవాళ సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా […]

Update: 2021-05-22 05:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కేసులు పెరుగుతున్న కార‌ణంగా రాష్ట్రంలో వారంరోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించాల‌ని సీఎం స్టాలిన్ నిర్ణ‌యం తీసుకున్నారు. మే 10 నుంచి మే 24 వ‌ర‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించింది. మ‌రో రెండు రోజుల్లో ఆ గ‌డువు ముగుస్తుండ‌టంతో.. ఇప్పుడు వారంపాటు క‌ఠిన లాక్ డౌన్ విధించాల‌ని నిర్ణ‌యించింది.

ఇవాళ సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై అధికారుల‌తో చర్చించారు. అనంత‌రం వారంరోజులు కఠిన లాక్ డౌన్ విధించాలని సూచించారు. పకడ్బందీగా లాక్ డౌన్ విధించాలని, అప్పుడే కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందని స్టాలిన్ తెలిపారు.

Tags:    

Similar News