‘రూపాయికే ప్లేట్ (అన్ లిమిటెడ్) భోజనం’.. ఎక్కడంటే!
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఆహారం దొరక్క చాలా మంది నిరుపేదలు, అనాథలు రోజువారీగా జీవన్మరణ పోరాటం చేస్తుంటారు. అలాంటి వారి కోసం కనీసం ఒక్కపూట అయినా భోజనం అందించేందుకు దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవో సంఘాలు కూడా పనిచేస్తున్నాయి. అయితే, కొందరు ఉచితంగా భోజనం అందిస్తుంటే మరికొందరు తక్కువ డబ్బులకు భోజనం అందిస్తున్నారు. అయితే, దేశ రాజధానిలోని తూర్పు ఢిల్లీలో అన్నార్థుల కోసం ప్రత్యేకంగా రూ.1కే ప్లేట్ భోజనం అందిస్తున్నారు బీజేపీ ఎంపీ, మాజీ […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఆహారం దొరక్క చాలా మంది నిరుపేదలు, అనాథలు రోజువారీగా జీవన్మరణ పోరాటం చేస్తుంటారు. అలాంటి వారి కోసం కనీసం ఒక్కపూట అయినా భోజనం అందించేందుకు దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవో సంఘాలు కూడా పనిచేస్తున్నాయి. అయితే, కొందరు ఉచితంగా భోజనం అందిస్తుంటే మరికొందరు తక్కువ డబ్బులకు భోజనం అందిస్తున్నారు. అయితే, దేశ రాజధానిలోని తూర్పు ఢిల్లీలో అన్నార్థుల కోసం ప్రత్యేకంగా రూ.1కే ప్లేట్ భోజనం అందిస్తున్నారు బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.
ఈయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన అనంతరం ఈ పథకాన్ని ప్రారంభించారు. ‘‘ఏక్ ఆషా.. జన్ రసోయ్’’ పేరుతో ఢిల్లీలోని గాంధీనగర్‌లో క్యాంటీన్లు ప్రారంభించారు. ఒక్క రూపాయికే అన్ లిమిటెడ్ ‘థాలీ’(భోజనం)తో నిరుపేదల కడుపు నింపుతున్నారు. ‘గౌతమ్ గంభీర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్స్ నడుస్తుండగా.. ఇందులో క్వాలిటీ మీల్స్ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.
పేదలు ఖాళీ కడుపుతో పడుకోకూడదనే ఉద్దేశ్యంతో ఈ క్యాంటీన్స్ ఓపెన్స్ చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల సమయంలో భోజనం అందుబాటులో ఉంటుంది. తాజాగా ఈ కార్యక్రమం గురించి గంభీర్ గొప్ప విషయాన్ని పంచుకున్నారు. తన రెండేళ్ల పదవి కాలంలో ఈ క్యాంటీస్స్ ద్వారా 6 లక్షల మందికి భోజనం అందించినట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన నివేదిక కార్డును ఆదివారం సమర్పించారు. గంభీర్ ప్రారంభించిన రెండు కమ్యూనిటీ కిచెన్ల నుంచి ఆరు లక్షల మంది ప్లేట్ భోజనానికి రూ.1 చొప్పున నాణ్యమైన ఆహారాన్ని అందించినట్లు ఆయన హైలైట్ చేశారు. అంతేకాకుండా 7,48,800 మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను ఘాజిపూర్ పల్లపు ప్రాంతంలో శుద్ధి చేసినట్లు గంభీర్ వివరించారు.