ఏపీ ఈఎస్ఐ కుంభకోణంలో సూర్యాపేట వాసి

దిశ, కోదాడ: ఏపీలో ఈఎస్ఐ కుంభకోణం మూలంగా ఇప్పటికే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి కూడా ఉన్నట్టు తెలస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఏపీకి చెందిన ఏసీబీ అధికారులు అనంతగిరి మండలంలోని ఓ వ్యక్తి వద్దకు వచ్చి రహస్యంగా విచారించి వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. విచారణ అనంతరం మండలానికి చెందిన వ్యక్తిపై ఏ-3 నిందితుడిగా ఏపీ ఏసీబీ […]

Update: 2020-06-22 09:01 GMT

దిశ, కోదాడ: ఏపీలో ఈఎస్ఐ కుంభకోణం మూలంగా ఇప్పటికే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి కూడా ఉన్నట్టు తెలస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఏపీకి చెందిన ఏసీబీ అధికారులు అనంతగిరి మండలంలోని ఓ వ్యక్తి వద్దకు వచ్చి రహస్యంగా విచారించి వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. విచారణ అనంతరం మండలానికి చెందిన వ్యక్తిపై ఏ-3 నిందితుడిగా ఏపీ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి డైరెక్టర్‌గా ఆ వ్యక్తి వ్యవహరిస్తున్నాడు. ఈ కుంభకోణంలో ఏ–1 నిందితుడిగా ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ రమేష్‌కుమార్‌ను, ఏ–2గా ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. విచారణ అనంతరం ఏ-3 ముద్దాయి సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో ఏసీబీ అధికారులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News