సిద్దిపేటలో ఒకరు, మంచిర్యాలలో ఐదుగురికి పాజిటివ్
దిశ, ఆదిలాబాద్, దుబ్బాక: రాష్ర్టంలో కరోనా రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఒకరికి పాజిటివ్ రాగా, మంచిర్యాలలో మరో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వివరాళ్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన లక్షణాలు ఉండటంతో టెస్టులకు శాంపిల్స్ పంపించగా, సోమవారం పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులతో సహా, చుట్టు పక్కల వారికి క్వారంటైన్‌కు […]
దిశ, ఆదిలాబాద్, దుబ్బాక: రాష్ర్టంలో కరోనా రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఒకరికి పాజిటివ్ రాగా, మంచిర్యాలలో మరో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వివరాళ్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన లక్షణాలు ఉండటంతో టెస్టులకు శాంపిల్స్ పంపించగా, సోమవారం పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులతో సహా, చుట్టు పక్కల వారికి క్వారంటైన్‌కు తరలించారు.
అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఆదివారం 38 మంది నుంచి శాంపిల్స్ పంపించగా, సోమవారం ఐదుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో వీరికి చికిత్సలు అందించేందుకు హైదరాబాద్‌కు తరలిస్తునట్టు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. వీరు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అని అధికారులు ఆరా తీస్తున్నారు.