తొలి రోజు రూ. 544.55 కోట్లు జమ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ మంగళవారం నుంచి మొదలైంది. ముందుగా ఎకరా ఉన్న రైతుల నుంచి పంపిణీ మొదలుపెట్టారు. దీంతో మంగళవారం 18,12,656 మంది రైతుల ఖాతాల్లో రూ. 544.55 కోట్లు జమ అయింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి రైతులకు మెస్సెజ్‌లు వెళ్లాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి, ప్రపంచానికి రైతుబంధు, రైతుబీమా పథకాలు ఒక దిక్సూచి అని పేర్కొన్నారు. సీఎం […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ మంగళవారం నుంచి మొదలైంది. ముందుగా ఎకరా ఉన్న రైతుల నుంచి పంపిణీ మొదలుపెట్టారు. దీంతో మంగళవారం 18,12,656 మంది రైతుల ఖాతాల్లో రూ. 544.55 కోట్లు జమ అయింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి రైతులకు మెస్సెజ్‌లు వెళ్లాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి, ప్రపంచానికి రైతుబంధు, రైతుబీమా పథకాలు ఒక దిక్సూచి అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేసే వ్యవసాయ అనుకూల పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం పూర్తిగా మారిపోయిందని మంత్రి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.