నటీమణుల టాలెంట్.. నో ఫేడవుట్

దిశ, వెబ్‌డెస్క్ : మూవీ ఇండస్ట్రీలో రిటైర్‌మెంట్ ఏజ్ మీదకొచ్చినా..హీరోలు ఎప్పటికీ హీరోలుగానే కొనసాగుతారు. పాతికేళ్లలోపు హీరోయిన్స్‌తో రోమాన్స్ చేస్తారు. కానీ, ఓ హీరోయిన్ డబుల్ డిజిట్స్ సినిమాలు చేయగానే, ఆమె ప్లేస్‌ను యంగ్ హీరోయిన్ రిప్లేస్ చేసేస్తుంది. ఆమెకు మూడు పదులు దగ్గరికొస్తున్న కొద్దీ చాన్స్‌లు రావడం తగ్గిపోతాయి. ఇక కెరీర్ ఊపులో ఉండగానే పెళ్లయితే అంతే సంగతలు. వచ్చే ఆఫర్లు ముఖం చాటేస్తాయి. ఇప్పటికీ ఇలానే ఉన్నా..ప్రజెంట్ కొద్ది మార్పు కనిపిస్తోంది. హీరోయిన్ సెంట్రిక్ […]

Update: 2021-01-20 05:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మూవీ ఇండస్ట్రీలో రిటైర్‌మెంట్ ఏజ్ మీదకొచ్చినా..హీరోలు ఎప్పటికీ హీరోలుగానే కొనసాగుతారు. పాతికేళ్లలోపు హీరోయిన్స్‌తో రోమాన్స్ చేస్తారు. కానీ, ఓ హీరోయిన్ డబుల్ డిజిట్స్ సినిమాలు చేయగానే, ఆమె ప్లేస్‌ను యంగ్ హీరోయిన్ రిప్లేస్ చేసేస్తుంది. ఆమెకు మూడు పదులు దగ్గరికొస్తున్న కొద్దీ చాన్స్‌లు రావడం తగ్గిపోతాయి. ఇక కెరీర్ ఊపులో ఉండగానే పెళ్లయితే అంతే సంగతలు. వచ్చే ఆఫర్లు ముఖం చాటేస్తాయి. ఇప్పటికీ ఇలానే ఉన్నా..ప్రజెంట్ కొద్ది మార్పు కనిపిస్తోంది. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ సక్సెస్ కావడం, ఓటీటీల హవా పెరిగి వెబ్ సిరీస్‌లు సత్తా చాటుతుండటంతో ‘నటీమణుల’ ప్రతిభ వయసుతో ఫేడవుట్ కాదనే విషయం మేకర్స్‌ ఒప్పుకుంటున్నారు.

నటీమణులకు కెరీర్‌లో తమలోని నటిని సంతృప్తిపరిచే సినిమాలు రావడం చాలా చాలా తక్కువ. వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుంటూ తమ కెరీర్‌ను కొనసాగించినా..చాలా తక్కువ కాలంలోనే ఆ హోదా నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌గా(అక్క, వదిన, అత్త) డిమోట్ అవుతారు. కానీ, ఇప్పుడిప్పుడే నటీమణుల ప్రతిభకు పట్టంకట్టే రోజులు వస్తున్నాయి. కొన్ని ‘ఆఫ్-బీట్’ సినిమాలు లేదా సమాంతర సినిమాను పక్కన పెట్టి, మహిళా నటులు, ముఖ్యంగా వృద్ధాప్య నటులు మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి సినిమాను లీడ్ చేయడం నిజంగా స్వాగతించే పరిణామం. జీవితంలోని ఎన్నో సంఘటనలు, కోణాలను చూపిస్తూ సినిమాలు నిర్మిస్తుండగా, ఆయా కథలకు అనుగుణంగా భిన్నమైన ఏజ్ గ్రూప్స్‌కు సంబంధించిన నటీమణులకు అవకాశాలు వస్తున్నాయి. ఉమన్ సెంట్రిక్‌గా వచ్చిన సినిమాలన్నీ విజయం సాధించకపోయినా..కనీసం మార్పు అయితే ప్రారంభమైంది. ఓటీటీ రాకతో అది మరో మెట్టు పైకి చేరింది. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ దర్శకురాలు గౌరీ షిండే, ‘బదాయి హో’ దర్శకుడు అమిత్ శర్మ, ‘తుమారీ సులు’ మేకర్ సురేష్ త్రివేణీ యూనిక్ స్టోరీలతో పాటు, మిడిల్ క్లాస్ ఉమన్స్ జీవితాలను తెరమీద అద్భుతంగా ఆవిష్కరించగా, లాస్ట్ మూవీ ఫ్రైడే మన ముందుకు వచ్చిన చిత్రాల్లో(తాండవ్, త్రిభంగ) ఫిమేల్ క్యారెక్టర్స్‌ను ఎక్సలెంట్‌గా ఎస్టాబ్లిష్ చేశారు మేకర్స్.

డింపుల్ కపాడియా :

ఇటీవల హాలీవుడ్‌లో వచ్చిన ‘టెనెట్’ చిత్రంలో తన నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల జేజేలు అందుకుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో వెబ్ సిరీస్‌గా వచ్చిన ‘తాండవ్’లో పొలిటికల్ లీడర్‌గా మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసి మరోసారి తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించింది. అనురాధా కిషోర్‌గా ఆమె స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. స్ట్రిప్ట్‌లో బలం లేకపోయినా, తన నటనానుభవంతో ప్రేక్షకులను అలరించింది.

తన్వి అజ్మి :

‘కపాడియా’లాంటి పవర్‌ఫుల్ పాత్ర కానప్పటికీ నెట్‌ఫ్లిక్స్ లేటెస్ట్ ఫిల్మ్ ‘త్రిభంగ’లో తన్వి అజ్మి..రైటర్ నయనతారగా ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్యారెక్టర్ ప్లే చేసింది. సినిమా అక్కడక్కడ బోర్ కొట్టించినా తన్వి పర్ఫామెన్స్ కట్టిపడేసింది. మరీ ముఖ్యంగా పితృస్వామ్యాన్ని ధిక్కరించడానికి, మహిళా సాధికారత, హక్కుల కోసం పడిన తపన, తన కుటుంబంపై తనను తాను నిలబెట్టుకోవడానికి ఆమె పడిన సంఘర్షణ, ఆ నటన నిజంగా ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

సుస్మితా సేన్, షెఫాలి షా, నీనా గుప్తా :

డిస్నీ ప్లస్ హాట్‌‌స్టార్‌లో వచ్చిన ‘ఆర్య’ సినిమాలో సుస్మిత నటనతో పాటు, నిర్భయ ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘ఢిల్లీ క్రైమ్’లో షెషాలి షా, ‘బదాయి హో’ చిత్రంలో నీనా గుప్తా క్యారెక్టర్స్ ప్రేక్షకుల మదిని దోచుకున్నాయి. వీళ్లంతా ఉమన్ సెంట్రిక్ పాత్రలకు న్యాయం చేసి, ఆ తరహా మరెన్నో కథలు స్క్రీన్ మీదకు రావడానికి దోహదపడ్డారు. వీళ్లే కాదు దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి కమ్‌బ్యాక్ మూవీ ‘ఇంగ్లిష్‌వింగ్లిష్’, ఆ తర్వాత వచ్చిన ‘మామ్’, విద్యాబాలన్ లీడ్ రోల్స్ పోషించిన ‘తుమారీ సులు’ ‘కహానీ’..రాణి ముఖర్జీ నటించిన ‘నో వన్ కిల్లడ్ జెస్సికా’ ‘మర్దానీ’ చిత్రాలు నిన్నటితరం హీరోయిన్లను మరోసారి మెయిన్ రోల్స్‌‌గా చూపించిన చిత్రాలుగా చెప్పుకోవచ్చు. క్రియేటర్స్ మూసకథలు, సంప్రదాయ ధోరణులను పక్కనపెట్టి, ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే కథలను తీయగలిగితే ఇలాంటి నటీమణులు మళ్లీ తెరమీదకు వస్తారు. ఇప్పుడు ప్రారంభమైన మార్పునకు ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. తమలోని ప్రతిభను నిరూపించుకోవడానికి క్రియేటర్స్‌ ఇలాంటి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తే వారి సత్తా ప్రపంచానికి తెలుస్తుంది.

Tags:    

Similar News