క్యాబ్‌లలో షేరింగ్ ఉండదిక!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా క్యాబ్ సర్వీసుల కంపెనీలు ఉబర్, ఓలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. కరోనాను అరికట్టడంలో భాగంగా ‘పూల్ రైడ్’, ‘షేరింగ్’ సర్వీసులను నిలిపేస్తున్నట్టు ప్రకటించాయి. శనివారం నుంచి ఎవరైనా ఉబర్, ఓలా కార్లను బుక్ చేసుకుంటే ఒక్కరు లేదంటే ఒకే కుటుంభానికి చెందిన వారు మాత్రమే అందులో ప్రయాణించాల్సి ఉంది. గడిచిన రెండు మూడు వారాలుగా ‘షేరింగ్’ సర్వీసులు చాలావరకు తగ్గిపోయాయని, ప్రజలే స్వచ్ఛందంగా పూల్ సర్వీసులను మానుకుంటున్నారని […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా క్యాబ్ సర్వీసుల కంపెనీలు ఉబర్, ఓలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. కరోనాను అరికట్టడంలో భాగంగా ‘పూల్ రైడ్’, ‘షేరింగ్’ సర్వీసులను నిలిపేస్తున్నట్టు ప్రకటించాయి. శనివారం నుంచి ఎవరైనా ఉబర్, ఓలా కార్లను బుక్ చేసుకుంటే ఒక్కరు లేదంటే ఒకే కుటుంభానికి చెందిన వారు మాత్రమే అందులో ప్రయాణించాల్సి ఉంది. గడిచిన రెండు మూడు వారాలుగా ‘షేరింగ్’ సర్వీసులు చాలావరకు తగ్గిపోయాయని, ప్రజలే స్వచ్ఛందంగా పూల్ సర్వీసులను మానుకుంటున్నారని కంపెనీలు అభిప్రాయపడ్డాయి. అందుకే పూర్తీ ఈ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. అంతేకాకుండా క్యాబ్‌లలో పరిశుభ్రత ఉండేలా చర్యలు చేపడుతున్నట్టు, ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలను పాటిస్తున్నట్టు చెప్పారు. పైగా ప్రజలు కూడా అత్యవసరమైతే తప్పించి బయటకు రాకపోవడంతొ క్యాబ్‌లకు డిమాండ్ కూడా తగ్గిందని కొందరు డ్రైవర్లు చెబుతున్నారు. ఇండియాలో ఇప్పటివరకూ 258 కరోనా కేసులు నమోదు కాగా, నలుగురు మరణించారు.
Tags: coronavirus effect, cab service, ola, uber