ఐపీఓకు సిద్ధమవుతున్న ఓలా

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ క్యాబ్ సేవల కంపెనీ ఓలా త్వరలో ఐపీఓకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఐపీఓను నిర్వహించడానికి కోటక్ బ్యాంకు, సిటీ గ్రూప్‌లను నియమించినట్టు ఓలా తెలిపింది. ఐపీఓ ద్వారా 1 బిలియన్ డాలర్లు(రూ. 7,400 కోట్లు) నిధుల సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఓలా పేర్కొంది. సంస్థ పెట్టుబడిదారులుగా ఉన్న టైగర్ గ్లోబల్, సాఫ్ట్‌బ్యాంక్ కంపెనీలు మోర్గాన్ స్టాన్లీని ఐపీఓ నిర్వహణకు ఎంపిక చేశాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఐపీఓకు వచ్చే అవకాశం […]

Update: 2021-08-30 11:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ క్యాబ్ సేవల కంపెనీ ఓలా త్వరలో ఐపీఓకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఐపీఓను నిర్వహించడానికి కోటక్ బ్యాంకు, సిటీ గ్రూప్‌లను నియమించినట్టు ఓలా తెలిపింది. ఐపీఓ ద్వారా 1 బిలియన్ డాలర్లు(రూ. 7,400 కోట్లు) నిధుల సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఓలా పేర్కొంది. సంస్థ పెట్టుబడిదారులుగా ఉన్న టైగర్ గ్లోబల్, సాఫ్ట్‌బ్యాంక్ కంపెనీలు మోర్గాన్ స్టాన్లీని ఐపీఓ నిర్వహణకు ఎంపిక చేశాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఐపీఓకు వచ్చే అవకాశం ఉందని, ఆ సమయానికి ఓలా సంస్థ విలువ సుమారు రూ. 59 వేల కోట్లుగా ఉంటుందని అంచనా.

కాగా, దేశీయంగా దిగ్గజ స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే ఐపీఓకు సిద్ధమవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, బైజూస్ లాంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా, ఓలా వీటి సరసన చేరింది. ఓలా ఐపీఓకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఓలా సంస్థలో మొత్తం 15 లక్షల మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. దేశవ్యాప్త్నగా 250 పట్టణాల్లో ఓలా క్యాబ్ సేవలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా, భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే లాంటి దేశాల్లో ఓలా సేవలందిస్తోంది.

Tags:    

Similar News