బీపీసీఎల్ పెట్రోల్ పంపుల వద్ద ఓలా హైపర్‌ఛార్జర్‌ల ఏర్పాటు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థా ఓలా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) పెట్రోల్ పంపులతో పాటు నగరాల్లోని నివాస సముదాయాల్లో హైపర్‌ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు ప్రక్రియ మొదలైందని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. వచ్చే ఏడాదికి 4,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను కలిగి ఉంటామన్నారు. ఈ హైపర్‌ఛార్జర్‌లను దేశవ్యాప్తంగా ఇన్‌స్టాల్ చేస్తున్నామని, రాబోయే 6-8 వారాల్లో ఇవి పనిచేస్తాయని భవిష్ స్పష్టం చేశారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జూన్ చివరి […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థా ఓలా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) పెట్రోల్ పంపులతో పాటు నగరాల్లోని నివాస సముదాయాల్లో హైపర్‌ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు ప్రక్రియ మొదలైందని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. వచ్చే ఏడాదికి 4,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను కలిగి ఉంటామన్నారు. ఈ హైపర్‌ఛార్జర్‌లను దేశవ్యాప్తంగా ఇన్‌స్టాల్ చేస్తున్నామని, రాబోయే 6-8 వారాల్లో ఇవి పనిచేస్తాయని భవిష్ స్పష్టం చేశారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జూన్ చివరి వరకు వినియోగదారులందరికీ ఉచితంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఇవ్వనున్నట్టు ఓలా అధినేత చెప్పారు.
హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్ ద్వారా ఓలా సంస్థ ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా ఉంది. దీనికోసం వివిధ నగరాల్లో రద్దీ ప్రాంతాల్లో ఆటోమేటెడ్, మల్టీలెవల్ ఛార్జింగ్‌ల ద్వారా వినియోగదారులు ఇబ్బందుల్లేకుండా ఛార్జింగ్ సదుపాయం పొందడానికి వీలవుతుందని కంపెనీ పేర్కొంది. రానున్న రోజుల్లో నగరాల్లోని మాల్స్, ఐటీ పార్కులు, ఇతర కీలక ప్రదేశాల్లో స్టాండ్‌లోన్ ఛార్జర్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ తెలిపింది. వీటిని ఓలాతో భాగస్వామ్యం కలిగిన కంపెనీలు నిర్వహించనున్నాయి.