స్మార్ట్‌ఫోన్ రిటైలర్ల అవకతవకలపై మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ఆందోళన

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ రిటైలర్లు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు, ఆన్‌లైన్ పోర్టల్‌లు అనైతిక వ్యాపార పద్ధతులను అనుసరిస్తున్నాయని, వాటిని నియంత్రించాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ను కోరారు. దీనికోసం ప్రత్యేకంగా ‘పర్యవేక్షణా విభాగాన్ని’ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్(ఏఐఎంఆర్ఏ) పలు రిటైలర్ల వ్యాపార పద్ధతులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పలువురు రిటైలర్లు ఆన్‌లైన్ నుంచి పెద్దమొత్తంలో స్టాక్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఆ స్టాక్‌కు బిల్లింగ్, జీఎస్టీ చెల్లించకుండా తమ […]

Update: 2021-04-02 05:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ రిటైలర్లు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు, ఆన్‌లైన్ పోర్టల్‌లు అనైతిక వ్యాపార పద్ధతులను అనుసరిస్తున్నాయని, వాటిని నియంత్రించాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ను కోరారు. దీనికోసం ప్రత్యేకంగా ‘పర్యవేక్షణా విభాగాన్ని’ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్(ఏఐఎంఆర్ఏ) పలు రిటైలర్ల వ్యాపార పద్ధతులపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

పలువురు రిటైలర్లు ఆన్‌లైన్ నుంచి పెద్దమొత్తంలో స్టాక్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఆ స్టాక్‌కు బిల్లింగ్, జీఎస్టీ చెల్లించకుండా తమ స్టోర్‌లలో విక్రయిస్తున్నారని ఏఐఎంఆర్ఏ తెలిపింది. ఫోన్ బ్రాండ్ కంపెనీలకు ఈ వ్యవహారం తెలుసని, ఇందులో 60 శాతం కంటే ఎక్కువ ఆన్‌లైన్ స్టాక్స్ బిల్లులు లేకుండా చిన్న రిటైలర్లు, టోకు వ్యాపారుల ద్వారా మార్కెట్లోకి వస్తున్నాయని వివరించింది. షియోమీ, ఒప్పో వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఇలాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నాయని ఏఐఎంఆర్ఏ ఆరోపించింది. అయితే, షియోమీ సంస్థ దీన్ని ఖండించగా, ఒప్పో స్పందించేందుకు నిరాకరించింది.

Tags:    

Similar News