అధికారుల ‘కట్టు కథలు’.. కరోనా పేషెంట్ సూసైడ్‌పై అబద్ధాలు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొవిడ్ పేషెంట్ అత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. సోమవారం జనరల్ ఆసుపత్రి కొవిడ్ విభాగం నాలుగవ అంతస్తు నుంచి మోపాల్ మండలానికి చెందిన ఆర్.హుస్సేన్ అనే కొవిడ్ పేషెంట్ దూకేశాడు. ఈ ఘటనలో వెన్నుముక విరిగి, తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే, సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కానీ, మృతి చెందిన వ్యక్తి కరోనా పేషెంట్ కాదు అని […]

Update: 2021-04-26 12:06 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొవిడ్ పేషెంట్ అత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. సోమవారం జనరల్ ఆసుపత్రి కొవిడ్ విభాగం నాలుగవ అంతస్తు నుంచి మోపాల్ మండలానికి చెందిన ఆర్.హుస్సేన్ అనే కొవిడ్ పేషెంట్ దూకేశాడు. ఈ ఘటనలో వెన్నుముక విరిగి, తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే, సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కానీ, మృతి చెందిన వ్యక్తి కరోనా పేషెంట్ కాదు అని జిల్లా కలెక్టర్ నుంచి పోలీసులు కట్టు కథలు అల్లారు. ముందుగా కరోనా పేషెంట్ కాదు అని జిల్లా కలెక్టర్ ప్రకటించగా.. ఔట్ పేషెంట్ నీరసంగా ఆస్పత్రికి వచ్చి భవనం మీద నుంచి దూకేశాడు అంటూ పోలీసులు సైతం నమ్మబలికారు.

కానీ, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం గుడితాండకు చెందిన ఆర్. హుస్సేన్ వృతి రీత్యా ఆటో డ్రైవర్. ఇటీవల కరోనా టెస్టు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరాడు. ఇక చికిత్స పొందుతున్న సమయంలో భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఎందుకీ దాపరికం

నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ పరిక్షలు, పాజిటివ్ కేసులు, మరణాల విషయంలో జిల్లా అధికార యంత్రాంగం దాపరికానికి పాల్పడుతుంది అనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పాజిటివ్ కేసులకు, యాక్టివ్ కేసులకు లెక్కే కుదరడం లేదు. జిల్లా ఆసుపత్రల్లో పరీక్షల నిర్వాహణకు కిట్ల కోరత లేదంటున్నా.. టెస్టులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అందుకు కిట్ల కొరత కారణమంటే అస్సలే ఒప్పుకోవడం లేదని చెబుతున్నారు జనాలు. ఇటువంటి ఆరోపణలు, విమర్శల నడుమ సోమవారం కొవిడ్ పేషెంట్ ఆత్మహత్యతో అసలు నిజం బయటపడిందని అనుకుంటున్నారు.

Tags:    

Similar News