మూడు మేకలకు రూ.1500 ఫైన్.. ఎందుకో తెలుసా?
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కు అధిక ప్రాధాన్యత ఇవ్వగా అధికారులు సైతం తాము అదే బాటలో పయనిస్తామని నిరూపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ ఆవరణలో హరితహారం లో మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ కోసం తగిన చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న మొక్కలను తస్లిమ్ బేగం కు చెందిన మూడు మేకలు మొక్కలను మేశాయి. ఇది గమనించిన మున్సిపల్ కమిషనర్ రాజలింగం మేకలను బందించాలని సిబ్బందికి సూచించారు. యజమాని ని […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కు అధిక ప్రాధాన్యత ఇవ్వగా అధికారులు సైతం తాము అదే బాటలో పయనిస్తామని నిరూపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ ఆవరణలో హరితహారం లో మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ కోసం తగిన చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న మొక్కలను తస్లిమ్ బేగం కు చెందిన మూడు మేకలు మొక్కలను మేశాయి. ఇది గమనించిన మున్సిపల్ కమిషనర్ రాజలింగం మేకలను బందించాలని సిబ్బందికి సూచించారు. యజమాని ని పిలిచి ఒక్కో మేకకు 500 రూపాయల చొప్పున జరిమానా విధించారు. యజమాని జరిమానా చెల్లించి మేకలను తీసుకెళ్లారు. హరితహారం మొక్కల సంరక్షణ కు ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యత తీసుకోవాలని కమిషనర్ కోరారు.