అప్రమత్తమైన అధికారులు.. ఆత్మకూర్‌లో ఇంటింటి సర్వే

దిశ, నల్లగొండ: మొన్నటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకేసారి నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికార యంత్రాంగం కూడా వెంటనే అప్రమత్తమై ఆత్మకూర్ మండలంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. కొత్త వ్యక్తులను గ్రామాల్లోకి రాకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ వరకూ ఒక్క కరోనా కేసు కూడా లేకుండా గ్రీన్‌జోన్‌లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం […]

Update: 2020-05-11 06:35 GMT

దిశ, నల్లగొండ: మొన్నటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకేసారి నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికార యంత్రాంగం కూడా వెంటనే అప్రమత్తమై ఆత్మకూర్ మండలంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. కొత్త వ్యక్తులను గ్రామాల్లోకి రాకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ వరకూ ఒక్క కరోనా కేసు కూడా లేకుండా గ్రీన్‌జోన్‌లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తహసీల్దార్​, ఎస్సై, వైద్యాధికారులు ఆత్మకూర్​ మండంలంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Tags:    

Similar News