జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలుపై దాడులు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలుపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో స్కూలుకు చేరుకున్న అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి విద్యార్థులకు దాదాపు రూ.50వేల వరకు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధిక ఫీజులు, డొనేషన్లతో బెంబెలెత్తిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్‌పై దాడులు నిర్వహిస్తున్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలుపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో స్కూలుకు చేరుకున్న అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి విద్యార్థులకు దాదాపు రూ.50వేల వరకు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధిక ఫీజులు, డొనేషన్లతో బెంబెలెత్తిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్‌పై దాడులు నిర్వహిస్తున్నారు. సొసైటీ రిజిస్ట్రేషన్ నిబంధనలను సైతం స్కూల్ యాజమాన్యం బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ డీఈవో, ఆర్జేడీ విచారణ జరుపుతున్నారు.