మహిళా ఉద్యోగులను వేధించిన అధికారి.. కలెక్టర్ ఏం చేశారంటే..

దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎంపీఓపై జిల్లా కలెక్టర్ నిఖిల సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం స్టేషన్ ఘ‌న్‌పూర్ ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న సురేష్ చిల్పూర్.. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో మహిళ కార్యదర్శులను వేధింపులకు గురి చేస్తున్నాడని నలుగురు మహిళా కార్యదర్శులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జూలై 20న డీపీఓ ఆధ్వర్యంలో చిల్పూర్ మండల కేంద్రంలో విచారణ చేపట్టి ఆ నివేదికను జూలై 24న సమర్పించారు. […]

Update: 2021-08-06 21:20 GMT

దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎంపీఓపై జిల్లా కలెక్టర్ నిఖిల సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం స్టేషన్ ఘ‌న్‌పూర్ ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న సురేష్ చిల్పూర్.. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో మహిళ కార్యదర్శులను వేధింపులకు గురి చేస్తున్నాడని నలుగురు మహిళా కార్యదర్శులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు జూలై 20న డీపీఓ ఆధ్వర్యంలో చిల్పూర్ మండల కేంద్రంలో విచారణ చేపట్టి ఆ నివేదికను జూలై 24న సమర్పించారు. విచారణ నివేదికను పరిశీలించిన కలెక్టర్ నిఖిల ఎంపీఓ సురేష్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కార్యదర్శులను వేధిస్తున్నాడన్న ఆరోపణలు వివాదాస్పదంగా మారడంతో రెండు రోజుల కిందట సురేష్.. ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, ఎంపీడీవోలతో వాగ్వివాదానికి దిగి అసభ్యకరంగా మాట్లాడటం విమర్శలకు దారి తీసింది.

Tags:    

Similar News